మహిళపై రేప్, బెదిరింపు: క్లాస్‌కు వెళ్తుంటే బాలికని ఆపి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆగ్రాకు 25 కిలోమీటర్ల దూరంలోని కందౌలీ పట్టణంలో పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ బాలిక కంప్యూటర్ కోచింగ్‌కు వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకొని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
అనంతరం ఆ బాలికను ఆమె ఇంటి వద్దే పడేసి పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు ఈ ఘటన జూలై 11వ తేదీన జరిగింది.

ఒడిశాలో...
ఒడిశాలో 28 ఏళ్ల వివాహిత దళిత మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. కేంద్రపారా జిల్లా బడగావ్‌లోని తన బంధువుల ఇంటి నుంచి ఆమెను అపహరించిన ముగ్గురు వ్యక్తులు, పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
విషయాన్ని బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెట్టిన నిందితులు ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టారు. ఈ విషయంపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications