ఘోర ప్రమాదం: పడవ బోల్తా పడి 15 మంది మృతి, ప్రధాని మోడీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
తిరువనంతపురం: కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పలువురు పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో అందులోని 15 మంది మరణించారు. ఈ విషాద ఘటన మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
మలప్పురం జిల్లా తానూర్‌లోని తూవల్ తీరం టూరిస్ట్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
#UPDATE | The Death toll has increased to 15 in boat capsize accident in Malappuram district of Kerala: Minister V Abdurahiman
— ANI (@ANI) May 7, 2023
కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన ప్రతి ఒక్క మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పిఎంఓ ట్వీట్‌లో పేర్కొంది.
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
కేరళ టూరిజం మంత్రి మహమ్మద్ రియాస్ ఘటనా స్థలానికి కోజికోడ్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. స్థానికులు, పోలీసు అధికారులు, రెవెన్యూ యూనిట్లు, అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు చేపట్టింది. రెస్క్యూ, సెర్చ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, కనీసం పది మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
కాగా, గత నెలలోనే కేరళలో తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారని.. అప్పట్నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో బోటు షికార్లకు వెళుతున్నారు. విహార యాత్రల బోటింగ్ లకు కేవలం సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉందని, అయితే, దీన్ని పట్టించుకోకుండా రాత్రిపూట కూడా కొన్ని బోట్ల సంచరిస్తున్నాయని తనూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ముస్తాఫా తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications