దారుణం: ప్రియుడితో రేప్ చేయించి కోడలిని కాల్చేసింది

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులైన బాధితురాలి అత్తను అరెస్ట్ చేశారు. పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. నిందితురాలు, బాధితురాలి అత్త మర్జీనా బిబికి స్వపన్ నమన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం ఆమె కోడలి(15)కి తెలిసింది. దీంతో ఆమెపై అత్యాచారం చేయాలని స్వపన్‌ను ప్రేరేపించింది అత్త.
ఈ నేపథ్యంలో స్వపన్ బాధిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి ఎవరికైనా చెబుతుందేమోనని భయాందోళనకు గురైన మర్జీనా బిబి ఆమె కోడలిపై మంగళవారం రాత్రి కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితురాలి అరుపులు విన్న ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఉదయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అగార్తాలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల కారణంగా ఆమె బుధవారం మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితురాలు మర్జీనా బిబిని అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడు స్వపన్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టినట్లు గోమతి ఎస్పి సుందరం చెప్పారు.












Click it and Unblock the Notifications