15 ఏళ్ల బాలికను తల్లిని చేసిన 13 ఏళ్ల బాలుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళ పోలీసుల వద్దకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ఇంటి పక్కనే ఉండే 15 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన నేరంలో 13 ఏళ్ల అబ్బాయిని కొల్లాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా బాలనేరస్తుల న్యాయబోర్డు అయిన కొల్లాం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద అతడిని హాజరు పరిచారు. బాలుడికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసి తల్లిదండ్రులతో ఇంటికి పంపేశారు.

గతంలో ఇలాంటిదే మరోకేసు ఎర్నాకులంలో బయటపడింది. 16 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల అబ్బాయితో కలిసి ఓ బిడ్డను కంది. తాజా కేసు నాలుగు రోజుల క్రితమే ఈ స్టేషన్‌కు వచ్చింది.

15-year-old Girl.. says 13-year-old is her child’s father

తొమ్మిదో తరగతి చదివిన బాలిక ఓ బిడ్డను కంది. తనకు కడుపునొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని వైద్యురాలు చెప్పారు.

అమ్మాయిది చిన్న వయసు కాబట్టి ఎందుకైనా మంచిది పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ సూచించారు. అయితే ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఆ అమ్మాయి బిడ్డను కంది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

పక్కింటి కుర్రాడే తన గర్భానికి కారణమని ఆ అమ్మాయి తెలిపింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ అబ్బాయి మంగళూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లగా.. పోలీసులు అతడిని అక్కడినుంచి పోలీసులు తీసుకొచ్చారు.

ఆ అబ్బాయి కూడా తన నేరం అంగీకరించాడు. తాను ఆ అమ్మాయిని కొన్నిసార్లు కలిసిన మాట వాస్తవమేనని, తమ మధ్య లైంగిక సంబంధం కూడా ఉందని అతడు తెలిపాడు. దీంతో పోలీసులు ఆ బాలుడిని బాల నేరస్తుల న్యాయబోర్డు వద్దకు తీసుకెళ్లారు.

బాలుడి రక్త నమూనాలను సేకరించిన పోలీసులు వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపారు. నిజంగా ఆ బాలిక ప్రసవించిన బిడ్డకు ఈ బాలుడే తండ్రా? కాదా? అన్నది నిర్ధారించనున్నారు. ఇద్దరూ మైనర్లే కాబట్టి ఈ కేసులో ఏం చేయాలో న్యాయ నిపుణులను అడిగి తెలుసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
THIRUVANANTHAPURAM: In a strange case, Pathanapuram police (Kollam), on Thursday, took a 13-year-old boy into custody on allegation of impregnating his 15-year-old neighbour. He was produced before Kollam chief judicial magistrate, who is also the chairman of Juvenile Justice Board in the district. The magistrate granted bail and sent him with his parents. Recently a similar case was reported in Ernakulam, where a 16-year-old girl gave birth to the child, fathered by a 12-year-old boy.According to the police, the case was registered four days ago after the girl, who completed Class IX, delivered a baby. She complained of stomach pain and when she was taken to hospital, the doctor informed her mother that she was fully pregnant.
Please Wait while comments are loading...