షాకింగ్: యువతి కడుపులోంచి 150 వానపాములు వెలికితీత!

కడుపునొప్పితో బాధపడుతున్న ఓ యువతికి శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులోంచి దాదాపు 150 బతికున్న వానపాములను వైద్యులు వెలికితీసిన ఘటన ఇది.

ఉత్తరప్రదేశ్: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ యువతికి శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులోంచి 150 వానపాములను వైద్యులు వెలికితీసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి కి చెందిన నేహా బేగం(22) తరచూ కడుపునొప్పి, వాంతులతో బాధపడేది. ఏళ్ల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా.. ఎంతోమంది వైద్యులను సంప్రదించినా ఫలితం కానరాలేదు.

150 Live Worms Removed From Woman’s Stomach In Four-Hour Operation

చివరికి కేజీ నందా ఆసుపత్రి వైద్యులు ఆమె పేగుల్లో ఏదో ఆడ్డుపడుతున్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స సమయంలో ఆమె పేగుల్లోంచి వానపాములు బయటికి రావడం చూసి వైద్యులు నివ్వెరపోయారు.

దాదాపు 4 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి నేహా బేగం పేగుల్లోంచి 10 అంగుళాల పొడవైన దాదాపు 150 బతికున్న వానపాములు బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ విషయమై కేజీ నందా ఆసుపత్రిలోని మేల్ గైనకాలజిస్టు డాక్టర్ ఆనద్ ప్రకాష్ తివారీ మాట్లాడుతూ.. ఇలాంటి కడుపునొప్పి కేసుల్లో సాధారణంగా 3 లేదా 4 వాన పాములు బయట పడుతుంటాయని, కానీ ఇంత పెద్ద సంఖ్యలో వానపాములు బయట పడడం మాత్రం ఇదే తొలిసారని, తామే దిగ్బ్రాంతికి గురయ్యామని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+