ఐసిస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు హిందూ 'ధర్మసేన'

లక్నో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు 'ధర్మసేన' సిద్ధమవుతోందట. ఉత్తరాఖండ్ సరిహద్దులో హిందూ స్వాభిమాన్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఐసిస్‌తో దీటుగా పోరాడేందుకు ఇది సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మరింతగా పెరిగిపోనుందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో హిందూ స్వాభిమాన్ ఇప్పటికే 15,000 ధర్మసేన సైనికులను సిద్ధం చేసింది. వీరు దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ప్రమాణం చేశారు.

15000 strong 'dharma sena' in Uttar Pradesh readies for war with Islamic State

ఈ గ్రూపులో చిన్నారులు కూడా చేరారని తెలుస్తోంది. వీరందరికీ కత్తి పట్టడం, బాణాలు ప్రయోగించడం తదితర అంశాలపై శిక్షణను అందిస్తున్నారు. ఈ శిబిరాల్లో పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ శిక్షణనిస్తున్నారు.

ఈ ధర్మసేనలో 8 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులు ఉన్నారు. దాదాపు యాభై శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో రహస్యంగా, మరికొన్ని కేంద్రాల్లో బహిరంగంగా శిక్షణను ఇస్తున్నారు. మీరట్లో మూడు, ముజఫర్ నగర్లో ఐదు కేంద్రాలు బహిరంగంగా నిర్వహిస్తున్నారు. శత్రువు దాడి చేసినప్పుడు తిప్పికొట్టడమే లక్ష్యంగా ధర్మసేన సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+