కారులో ఎత్తుకెళ్లి రేప్ చేసి ఇంటి వద్ద పడేశారు: బాలికపై రేప్, హత్య
ఘజియాబాద్: దేశంలో మహిళలపై, అమ్మాయిలపై దాష్టీకాలు ఆగడం లేదు. మగ మృగాలు మహిళలపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ 16 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నోయిడాలో బుధవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
పదో తరగతి చదువుతున్న బాధితురాలు ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి, కారులో ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ దాష్టీకానికి పాల్పడ్డారు

ఆ తర్వాత ఆమెను ఘజియాబాదులోని ఆమె నివాసం వద్ద పడేసి పోయారు. అత్యాచారం జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకు్నారు. కేసు నమోదు చేశారు.
ఆరేళ్ల బాలికపై రేప్, హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోలీ ప్రాంతంలో గల బద్దాపూర్ గ్రామంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. గత రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆ బాలిక సవం గురువారం ఉదయం పొలాల్లో కనిపించిందని పోలీసులు చెప్పారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య చేయడానికి ముందు అమ్మాయిపై అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టులు జరగలేదు.












Click it and Unblock the Notifications