బాలికను బంధించి అత్యాచారం, చిత్రహింసలు

బెంగళూరు: బాలికను చిత్రహింసలకు గురి చేసి గత 10 నెలల నుండి లైంగిక బానిస చేసిన వ్యాపారవేత్త కోసం బెంగళూరు, కర్ణాటకలోని బెల్గాం పోలీసులు గాలిస్తున్నారు. 16 సంవత్సరాల బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించామని పోలీసులు తెలిపారు.

బెంగళూరు నగరంలోని జేపీ నగరంలో ఓ మహిళ ప్యాషన్ డిజైనర్, వ్యాపారవేత్త నివాసం ఉంటోంది. ఈమె తన పిల్లలను చూసుకొవడానికి ఉత్తరాఖండ్ కు చెందిన ముగ్గురు కుటుంబ సభ్యలను బెంగళూరు పిలుచుకుని వచ్చింది. దంపతులతో పాటు వారికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది.

దంపతులు ఇద్దరు కూలి పనికి వెలుతున్నారు. బాలిక మహిళ వ్యాపారవేత్త ఇంటిలో ఉంటు వారి పిల్లలను చూసుకుంటున్నది. మహిళ వ్యాపారవేత్త భాగస్వామి సుఖవీందర్ సింగ్ అప్పుడప్పుడు జేపీ నగరలోని ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆ సందర్బంలో బేబి సిట్టర్ అయిన బాలిక మీద కన్ను వేశాడు.

16-year-old Uttarakhand girl raped last 10 months.

మహిళ వ్యాపారవేత్త ఇంటిలో లేని సమయంలో బాలిక మీద అత్యాచారం చేస్తు వచ్చాడు. విషయం బయటకు చెబితే నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. వ్యాపారం నిమిత్తం మహిళ వ్యాపారి కొన్ని నెలల క్రితం తాత్కాలికంగా ఇంటిని మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెల్గాం (బెలగావి)కు మార్చింది.

బాలికను బలవంతంగా బెల్గాం తీసుకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన సుఖవీందర్ సింగ్ బాలిక మీద పదేపదే అత్యాచారం చేస్తు వచ్చాడు. బాలిక మహిళ వ్యాపారవేత్తకు విషయం చెప్పింది. తనను బెంగళూరు పంపించేయాలని వేడుకునింది. ఈ భాదను తాను తట్టుకోలేనని మనవి చేసింది.

అయితే ఆ మహిళ వ్యాపారి నీవు లేనిపోని సినిమా స్టోరీలు చెబుతున్నావని, నిన్ను పంపించే ప్రసక్తే లేదని చెప్పింది. ఒక వేళ పారిపోతే నీ మీద చోరి కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించింది. బాలిక కష్టపడి బెంగళూరులో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వార సమాచారం అందించింది.

కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని బెల్గాం వెళ్లి మహిళ వ్యాపారి ఇంటిలో ఉన్న బాలికను రక్షించారు. 2014 జూన్ నుండి 2015 మే వరకు బాలిక మీద అత్యాచారం జరిగిందని వెలుగు చూసింది. కామాంధుడు సుఖవీందర్ సింగ్ పరారైనాడు. బెంగళూరు, బెల్గాం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+