బస్సు ప్రమాదం: 17మంది మృతి, 12మందికి తీవ్రగాయాలు
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మెయిన్‌పురి సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 17 మంది మృతిచెందారు.
ఈ ప్రమాదంలో మరో 35మందికి పైగా గాయపడ్డారు. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.

17 dead,more than 35 injured after a private bus hit a divider and overturned near Mainpuri pic.twitter.com/ySVQzf43TQ
— ANI UP (@ANINewsUP) June 13, 2018
ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications