జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. జమ్మూకు 170 కిలోమీటర్ల దూరంలో గల రాంబన్ జిల్లాలోని డిగ్దోల్ వద్ద జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
తీవ్రంగా గాయపడినవారిని హెలికాప్టర్ ద్వారా జమ్మూ ఆస్పత్రికి తరలించారు. చాలా ముంది ప్రయాణికులు యువకులే. రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు రాజౌరి జిల్లాలోని పూంఛ్ నుంచి కాశ్మీర్ లోయకు వెళ్తున్నారు.
గుజరాత్‌కు చెందినవారు కూడా కొంత మంది ఉన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ అధికారులకు సైనికాధికారులు సహకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications