బెంగళూరులో కాలి బూడిద అయిన 17 లగ్జరీ బస్సులు, దసరా పండుగ కోసం వచ్చి !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరం నుండి కర్ణాటకలోని వివిద నగరాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ఉన్నాయి. బెంగళూరు సిటీ నుంచి ఎక్కువగా లగ్జరీ బస్సు సర్వీసులు ఇతర రాష్ట్రాలకు సంచరిస్తున్నాయి. ప్రతిరోజు కొన్ని వేల మంది బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్నారు.
బెంగళూరు నుంచి ఎక్కువగా స్లీపర్ కోచ్ బస్సు సర్వీసులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తున్న ప్రైవేటు బస్సులు నగరంలోని అనేక ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రాంతాల్లో నిలుపుతున్నారు. ప్రతిరోజు రాత్రిపూట బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు బయలుదేరుతున్నాయి.

బెంగళూరు నగరంలోని వీరభద్రనగరలోని ఖాళీ స్థలంలో ప్రైవేటు బస్సులు పార్క్ చేస్తున్నారు. వీరభద్ర నగర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన గ్యారేజ్ లో విలాసవంతమైన ప్రైవేట్ బస్సులు పార్క్ చేస్తున్నారు. దసరా పండుగ సందర్బంగా పలు ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు బెంగళూరు చేరుకుంటున్నారు.
ఆదివారం చాలా బస్సులు బెంగళూరు చేరుకున్నాయి. బెంగళూరు వచ్చిన బస్సులు వీరభద్ర నగరలోని శ్రీనివాస్ కు చెందిన గ్యారేజ్ లో పార్క్ చేశారు. బస్సులు పార్క్ చేసిన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అన్ని బస్సులకు మంటలు వ్యాపించడంతో గ్యారేజ్ లో ఉన్న వాళ్లు హడలిపోయి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే 17 విలాసవంతమైన బస్సులు కాలి బూడిద అయ్యాయి. గ్యారేజ్ లో సుమారు 40 బస్సులు పార్క్ చేసి ఉన్నారని అక్కడి సిబ్బంది చెప్పారని, మంటలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications