ప్రియుడితో వెళ్లిందని చెల్లెల్ని చంపిన సోదరులు, అరెస్ట్

తమిళనాడులోని శివలప్పేరి ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల గోమతి. ఈమె తుత్తుకూడి సమీపంలో ఓ ప్రయివేటు కంపెనిలో పని చేస్తోంది. ఈమెకు తుత్తుకుడి జిల్లాకు చెందిన సహోద్యోగి మురుగున్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
వీరి ప్రేమ వ్యవహారంపై అమ్మాయి ఇంటి వారు వ్యతిరేకత తెలిపారు. దీంతో గోమతి తన ప్రియుడితో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. తమను కాదంటూ చెల్లెలు వెళ్లడంపై ఆగ్రహించిన ఆమె సోదరులు మురుగన్, సుడలైముత్తులు ప్రియుడి ఇంట్లో ఉన్న చెల్లెలిని క్రితం కలిశారు.
పెద్దలతో మాట్లాడి పెళ్లి చేస్తామని నమ్మించి ఆమెను అక్కడి నుండి తీసుకు వచ్చారు. జనసంచారం లేని ప్రాంతంలో బలవంతంగా ఆమెకు విషం కలిపిన శీతలపానియం ఇచ్చి హతమార్చారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారించగా విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications