ఢిల్లీ లిక్కర్ స్కామ్: ఇప్పటివరకు 171ఫోన్లు మిస్సింగ్: మిస్సింగ్ ఫోన్‌పై అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే!!
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారునిగా ఈడీ పేర్కొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో విచారణని ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న విచారణలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
మద్యం పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ గురించి ఈడి అధికారులు పదేపదే ప్రశ్నించారు. ఆ ఫోన్ ఎక్కడుంది, ఆ ఫోన్ తమకు కావాలంటూ కేజ్రీవాల్ ను అడిగారు. అయితే దీనికి ఆయన ఆ ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మద్యం పాలసీ రూపొందించిన సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ ను మిస్సింగ్ మొబైల్ గా పేర్కొంటున్నారు. అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక డేటా ఉన్నట్టు వారు అనుమానిస్తున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించినప్పటికీ ఆయన ఆ మొబైల్ ఫోన్ విషయంలో నోరు మెదపలేదు అని సమాచారం.
ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 170 ఫోన్లు మిస్ అయినట్టు, ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ 171వ ఫోన్ అని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న చాలామంది మొబైల్ ఫోన్లను, లాప్టాప్ లను ధ్వంసం చేసి కొత్త వాటిని ఉపయోగిస్తున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఈ కేసుకు సంబంధించి 17 మొబైల్ ఫోన్లలో డేటాను ట్రేస్ చేసినట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి.
మిగతా అన్ని మొబైల్ ఫోన్లను నిందితులు ధ్వంసం చేసినట్టు ఈడీ వర్గాల భోగట్టా. ఇదిలా ఉంటే నేడు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత విచారణ కూడా కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ కేసులో సమీర్ మహేంద్రు వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. రేపు మనీష్ సిసోడియా కార్యదర్శిగా ఉన్న సి అరవింద్ ఎదుట కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications