రివర్స్: రూ. 1. 44 కోట్ల కొత్త నోట్లు సీజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

కోయంబత్తూరు: పాత పెద్ద నోట్లు తీసుకుని కమీషన్ పద్దతిలో ఇతర నోట్లు ఇస్తున్న 18 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 1.44 కోట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

కోవై జిల్లాలోని కునియముత్తూరులో శ్రీక్రిష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ సమీపంలోని ప్రాంగణంలో పాత రూ.1,000, రూ.500 నోట్లు తీసుకుని ఇతర కరెన్సీ ఇస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా వేశారు.

18 held for facilitating notes exchange, Rs 1.44 crore seized

కాలేజ్ సమీపంలోని ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 18 మందిని పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి దగ్గర భారీ మొత్తంలో నగదు ఉన్న విషయం గుర్తించారు.

వారి దగ్గర ఉన్న రూ. 1.44 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1,000, రూ.500 నోట్లు తీసుకుని కమీషన్ పద్దతిలో వారికి ఇతర నోట్లు ఇస్తున్నారని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు. ఈ కొత్త నోట్ల కమీషన్ దందాలో ఎంత మంది పెద్దలు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. పాత నోట్లు చిక్కక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి అవసరాన్ని వాడుకుకుని భారీ మొత్తంలో కమీషన్ తీసుకుని వారిని మోసం చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The gang had been using the place near the college to exchange cash soon after the Centre announced demonetisation of Rs. 500 and Rs 1,000 notes. First, they helped exchange notes worth a few lakhs, but in the last few days the gang helped exchange notes worth over Rs. 20 lakh.
Please Wait while comments are loading...