ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది కూలీలు మృతి
జైపూర్: శనివారం అర్ధరాత్రి రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతాప్‌ఘడ్ జిల్లాలోని ధోలపణి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది మహిళలతో సహా 18 మంది కూలీలు మృతి చెందారు.
కూలీలు పనులను ముగించుకుని సామర్థ్యానికి మించి ఓ వ్యాన్‌లో ఎక్కారు. ఈ వ్యాన్ ధోలపణి వద్దకు రాగానే ఆగివున్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉదయ్ పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మృతుల కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు.












Click it and Unblock the Notifications