లేడీ టీచర్‌తో సంబంధం: తల్లిని చంపిన 18 ఏళ్ల యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాదులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. లేడీ టీచర్‌తో సంబంధం వద్దని చెప్పినందుకు 18 ఏళ్ల బాలిక తల్లిని హతమార్చింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

తన 38 ఏళ్ల తల్లిని బాలిక మార్చి 9వ తేదీన కొట్టి చంపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. లేడీ టీచర్‌తో బాలిక సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెతో కలిసి పారిపోలాని అనుకుంది. అయితే, బాలిక తల్లిదండ్రులు లేడీ టీచర్‌తో సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

18-year-old girl kills mother over relationship with female teacher

బాలిక 11వ తరగతి చదువుతోంది. బాలిక చదువుతున్న పాఠశాలలోనే ఉపాద్యాయురాలు పనిచేస్తోంది. సంఘటనపై బాలిక తండ్రి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తమ కూతురు తల్లిని శుక్రవారం తీవ్రంగా కొట్టిందని, ఆ సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్నారని సతీష్ కుమార్ చెప్పారు. కర్రలతో, రాడ్లతో కొట్టడంతోల్లికి తీవ్రమైన గాయాలై ఆ తర్వాత మరణించింది.

లేడీ టీచర్‌తో సంబంధంపై తన కూతురికి, తన భార్యకు మధ్య కొంత కాలంగా గొడవలు అవుతున్నాయని చెప్పారు.. 35 ఏళ్ల లేడీ టీచర్‌తో కలిసి జీవించడానికి తమ కూతురుర సెప్టెంబర్‌లో వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆ సమయంలో మైనర్ కావడంతో కూతురిని ఇంటికి తీసుకుని వచ్చినట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, an 18-year-old woman has been arrested for allegedly killing her mother who was opposed her daughter's relationship with a female teacher in Uttar Pradesh's Ghaziabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి