పని మనిషిపై రెండ్రోజులపాటు సామూహిక అత్యాచారం

18-year-old maid raped in Sirsa
సిర్సా: హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో దారుణం జరిగింది. ఢిల్లీకి చెందిన యువతి హర్యానాలోని సిర్సాలోని ఓ ఇంట్లో పని మనిషిగా విధులు నిర్వహించేందుకు వెళ్లగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 31న జరిగిన ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి ఆమె దుండగుల బారి నుంచి తప్పించుకుని రావడంతో వెలుగులోకి వచ్చింది.

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు. కాగా, పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన గదిలోనే ఉండే షమ్మఖుతన్.. సిర్సాలోని ఓ ఇంటికి పని మనిషి అవసరం ఉందని, అక్కడికి వెళ్లాలని కోరడంతో మే 31న సిర్సాకు బయల్దేరినట్లు బాధితురాలు తెలిపింది.

ఆ రోజు రాత్రి సిర్సా బస్టాండ్ చేరుకున్న తనను, ఇద్దరు యువకులు తమ కారులో బలవంతంగా ఎక్కించుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత కూడా ఓ గదిలో బంధించి రెండు రోజులపాటు తనను సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది.

సోమవారం రాత్రి తనను నథుసరి చోప్టా గ్రామం సమీపంలోకి తీసుకెళ్లడంతో సహాయం కోసం అరిచినట్లు ఆమె తెలిపింది. దీంతో భయానికి గురైన నిందితులు తనను అక్కడే విడిచిపెట్టి పరారైనట్లు బాధితురాలు చెప్పింది. స్థానికుల సహాయంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. బాధిత యువతి అత్యాచారానికి గురైనట్లు మెడికల్ రిపోర్టులో తేలిందని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+