లైంగిక వేధింపులు: ఢిల్లీలో యువతి దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 18ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోని పొలాల్లో జరగడం గమనార్హం. మంగళవారం ఉదయం ఈశాన్య ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ యువతిని గొంతుకోసి హత్య చేశారు. ఆమె వేసుకున్న దుస్తులు చిరిగిపోయి ఉండటంతో, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ, యువతిపై లైంగిక దాడి జరిగిందా? లేదా అనే విషయం బయటికి వస్తుందని చెప్పారు. కాగా, ఆ యువతికి రెండు నెలల్లో వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఆమెకు సంబంధించిన మాజీ ప్రేమికుడు ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటాడా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

పెళ్లి వాహనం బోల్తా: 8మంది మృతి
షిమ్లా: పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ప్రైవేటు వాహనం మంగళవారం తెల్లవారుజాము లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 250 అడుగుల ఎత్తునుండి వెళుతున్న ఈ వాహనం పల్టీలు కొడుతూ కిందికి జారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సామర్ధ్యానికి మించి ఓవర్ లోడ్ అవ్వడంతో... మూల మలుపు దగ్గర వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడని వారు తెలిపారు. సంఘటనా చేరుకున్న ఏఎస్పీ కుల్వత్ థాకూర్ క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతులంతా చంబా జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దీనిపై ముఖ్యమంత్రి విదర్భ సింగ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications