దారుణం: అత్యాచారం చేసి మొబైల్‌లో చిత్రీకరించారు
బెంగుళూరు: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బళ్లారిలోని కూడ్లిగి తాలూకా కొట్టూరు పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు శుక్రవారం ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే, పోలీసుల కథనం ప్రకారం పీయూసీ చదువుతున్న 18 ఏళ్ల విద్యార్ధినిని అదే ఊరికి చెందిన రమేష్ (21) అనే యువకుడు గత కొంతకాలంగా యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
నిందితుడు చెప్పిన మాయమాటలను నమ్మిన ఆ బాలిక నమ్మింది. దీంతో అక్టోబర్ 5వ తేదీన రమేష్ స్నేహితుడు పరశురాం సదరు యువతి ఇంటికి వచ్చి, మీ పెళ్లి విషయంపై రమేష్ మాట్లాడదలచుకున్నాడని, వెంటనే తనతో రావాలని ఆమెను కోరాడు.

దీంతో పరశురాం మాటలు నిజమని నమ్మిన ఆ యువతి అతనితో వెళ్లింది. యువతిని ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న రమేష్, అతని స్నేహితుడు పరశురాం యువతిపై అత్యాచారం చేశారు. అత్యాచార దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, వాట్సప్ ద్వారా అందరికీ పంపుతామని బెదిరించారు. చివరకు తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో, వారి సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications