1993 ముంబై పేలుళ్లు: దావూద్ ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్ అరెస్ట్

పనాజి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్‌ను గోవా పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. 1993 ముంబై పేలుళ్ల నిందితుడైన కిశోర్‌పై 18 మేజర్ క్రిమినల్ కేసులున్నాయి. అంతేగాక జెజె ఆస్పత్రి కాల్పుల ఘటనలో కూడా కిశోర్ నిందితుడు.

పుణెకు చెందిన శ్యామ్ కిశోర్ గరికపాటి రెండు దశాబ్ధాలుగా దావూద్ గ్యాంగ్‌లో కొనసాగుతున్నాడు. గత ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కిశోర్‌ను శనివారం రాత్రి సాలిగోవా గ్రామంలో అరెస్ట్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తీక్ కశ్యప్ తెలిపారు.

1993 Mumbai blasts: Dawood gang member Shyam Kishor held in Goa

1993లో జరిగిన ముంబై పేలుళ్లలో నిందితుడైన కిశోర్.. 2003లో పేరోల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నాడని కశ్యప్ చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా నకిలీ గుర్తింపుతో సాలిగోవా కిశోర్ ఉంటున్నాడని ఆయన తెలిపారు.

బ్లాక్ స్కార్పియోన్ అనే మరో పేరు కూడా కిశోర్‌కు ఉందని ఆయన చెప్పారు. జెజె ఆస్పత్రి కాల్పుల ఘటనలో కూడా దావూద్ ఇబ్రహీం, అరుణ్ గౌలిలతోపాటు ఇతని పాత్ర కూడా ఉందని ఎస్పీ కార్తీక్ కశ్యప్ తెలిపారు. మరో 18 క్రిమినల్ కేసుల్లో కూడా కిశోర్ నిందితుడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+