కాదేదీ అక్రమ నగదు రవాణాకు అనర్హం.. కారు టైరులో 2 కోట్లు తరలింపు (వీడియో)
బెంగళూరు : లోక్ సభ ఎన్నికల వేళ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తీరొక్క రూపంలో అక్రమ నగదు తరలించేందుకు నానా పాట్లు పడుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఎన్నికల సంఘం అధికారులు నిఘా పెంచడంతో వివిధ మార్గాల్లో అక్రమ నగదు రవాణాకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో తాజాగా బయటపడ్డ సంఘటన విస్మయం కలిగిస్తోంది.
#WATCH: Rs 2.30 cr in cash stuffed inside the spare tire in a car seized by Income-Tax officials. The cash was being transported from Bengaluru to Shivamogga. #Karnataka pic.twitter.com/yUeRdKVyzY
— ANI (@ANI) April 20, 2019
బెంగళూరు నుంచి శివమొగ్గకు అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 30 లక్షల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు. కారు స్పేర్ టైరులో 2000 రూపాయల నోట్ల కట్టలను అమర్చి నిందితులు చాకచక్యంగా తరలిస్తుండటంతో.. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. ఎన్నికల ఖర్చుల కోసమే ఈ అక్రమ నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు ఫైల్ చేశారు.













Click it and Unblock the Notifications