వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారి మళ్లిన ప్రధాని కాన్వాయ్: ఇద్దరు పోలీసులపై వేటు

|
Google Oneindia TeluguNews

నోయిడా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్(వాహనశ్రేణి) వెళ్లాల్సిన మార్గం నుంచి దారి మళ్లడానికి కారణమైన ఇద్దరు పోలీసులపై వేటు పడింది. మెట్రో రైలుమార్గాన్ని ప్రారంభించేందుకుగాను మోడీ డిసెంబర్ 25న నోయిడా వెళ్లిన విషయం తెలిసిందే.

ప్రధాని కాన్వాయ్లో ముందుగా వెళ్తున్న ఎస్సై దిలీప్‌సింగ్‌, పోలీసువాహన చోదకుడు జైపాల్‌ తొలుత నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే చోట మలుపు తిరగడంతో.. మహామాయ పైవంతెన వద్ద ప్రధాని రెండు నిమిషాలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

2 cops suspended for leading PM’s convoy on wrong route

అనంతరం ట్రాఫిక్‌ పోలీసులు హుటాహుటిన ఇతర వాహనాలను దారిమళ్లించి.. ప్రధాని కాన్వాయ్ సులువుగా వేళ్లేందుకు మార్గం సుగమం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులైన దిలీప్‌సింగ్‌, జైపాల్‌లను ఎస్‌ఎస్‌పీ లవ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు.

మరోవైపు, ప్రధాని భద్రతకు భంగం వాటిల్లేందుకు అవకాశముండేలా కాన్వాయ్ దారిమళ్లిన వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని నోయిడా ఎస్ ఎస్పీ లవ్ కుమార్ తెలిపారు.

English summary
Two Noida policemen who were in charge of piloting Prime Minister Narendra Modi's cavalcade during his Christmas visit to the city were suspended for negligence on Wednesday for straying from the planned route, leading to a major security lapse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X