వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు ఎమ్మెల్యేలపై గవర్నర్ అనర్హత వేటు, రాజస్ధాన్‌లో స్వైన్ ప్లూ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో లోకాయుక్త సిఫార్సు మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అనర్హత వేటు వేసింది. ఇందుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. బీజేపీకి చెందిన భజరంగ్ బహదూర్, బీఎస్పీకి చెందిన ఉమాశంకర్‌‌లపై అనర్హత వేటు వేశారు.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాజ్ గంజ్ జిల్లాలోని ఫరేంద్ర నియోజక వర్గం నుంచి భజరంగ్ బహదూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఉమా శంకర్ సింగ్ బైలియా జిల్లాలోని రాస్రా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 2 MLAs disqualified from UP Assembly after Lokayukta probe

కాంట్రాక్టర్లతో కుమ్మకై వీరిద్దరూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ లోకాయుక్తా సమర్పించిన నివేదికలో పేర్కొంది. లోకాయుక్తా సిఫార్సు మేరకు గవర్నర్ వీరిద్దరిపై అనర్హత వేటు వేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

రాజస్ధాన్‌లో పెరిగిన స్వైన్ ప్లూ కేసులు

రాజస్ధాన్‌లో స్వైన్ ప్లూ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధ రాజే ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ జనవరిలో నెలలో రాజస్ధాన్‌లో మొత్తం 25 స్వైన్ ప్లూ కేసులు నమోదయ్యాయి.

English summary
Uttar Pradesh MLAs Bajrang Bahadur Singh of BJP and BSP's Uma Shankar Singh were disqualified by the Governor from state Assembly today on the recommendation of Lokayukta which indicted them for irregularities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X