బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కర్ణాటకలో 10 మంది, 20 ఏళ్ల యువతి UKరిటన్, బెంగళూరులో హడల్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (కోవిడ్-19) విజృభిస్తుండటంతో ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. ఒక వైపు కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. అయితే దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా కర్ణాటకలో 10 కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదు అయ్యాయని స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పష్టం చేశారు. UK నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా వైరస్ సోకిందని మంత్రి శ్రీరాములు అన్నారు. ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధి భయంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు.

మక్కా వెళ్లిన కర్ణాటక వ్యక్తి కరోనాతో మృతి, మృతుడి బంధువుకు వైరస్, ఆనలుగురుకి పరీక్షలు, మంత్రి!మక్కా వెళ్లిన కర్ణాటక వ్యక్తి కరోనాతో మృతి, మృతుడి బంధువుకు వైరస్, ఆనలుగురుకి పరీక్షలు, మంత్రి!

UK నుంచి వచ్చిన యువతికి!

UK నుంచి వచ్చిన యువతికి!

కర్ణాటకలో మరో ఇద్దరికి కరోనా వైరస్ వ్యాధి సోకడంతో మొత్తం 10 మంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు. కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ఇచ్చిన సమాచారం మేరకు యూకే (UK) నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని వెలుగు చూసింది.

 కరోనా మృతుడి బంధువుకు వైరస్

కరోనా మృతుడి బంధువుకు వైరస్

మక్కా యాత్ర ముగించుకుని సౌదీ మీదుగా కర్ణాటకలోని కలబురిగి చేరుకున్న మహమ్మద్ హుసేన్ సయ్యద్ అనే వ్యక్తి కరోనా వైరస్ వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాధితో మరణించిన మహమ్మద్ హుసేన్ సయ్యద్ బంధువుకి (60 ఏళ్ల పురుషుడు) కరోనా వైరస్ వ్యాధి సోకిందని వెలుగు చూసింది.

కరోనా వైరస్ కు చెక్!

కరోనా వైరస్ కు చెక్!

కరోనా వైరస్ వ్యాధి సోకిన మరో ఇద్దరికి ప్రత్యేక చికిత్సలు చేయిస్తున్నామని, వారి ఆరోగ్యం కుదటపడిన తరువాత బయటకు పంపించే విషయం గురించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకుంటారని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి వైద్యలు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారని, ప్రజలు ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించాలని మంత్రి శ్రీరాములు అన్నారు.

బెంగళూరుకు విదేశాల దెబ్బ?

బెంగళూరుకు విదేశాల దెబ్బ?

విదేశాల నుంచి బెంగళూరు వస్తున్న వారిలో ఎవరెవరికి కరోనా వైరస్ వ్యాధి సోకింది ? అని క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తరువాతే వారిని బయటకు పంపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)కి వచ్చిన ప్రయాణికులకు అన్నీ వైద్య పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వచ్చిన తరువాత బయటకు పంపించాలని సంబంధిత శాఖ అధికారులు నిర్ణయించారు.

Recommended Video

Coronavirus In India : Paracetamol Sufficient For COVID 19, Trolls On KCR And Jagan
బోసిపోతున్న బెంగళూరు

బోసిపోతున్న బెంగళూరు

కరోనా వైరస్ భయంతో ఇప్పటికే ఐటీ, బీటీ రంగాలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలోని అనేక కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇచ్చారు. అదే విధంగా కరోనా వైరస్ వ్యాధి భయంతో బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు భయటకు రావాలంటే దాదాపుంగా భయంతో ముందు వెనుకా ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి భయంతో బెంగళూరు నగరంలని అనేక ప్రాంతాలు జనసంచారం లేక బోసిపోతున్నాయి.

English summary
Bengaluru: 2 More Covid 19 cases in Karnataka taking total number of confirmed cases to 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X