వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులపై కత్తులతో దాడి చేసిన నిహంగ్ సిక్కులు: ఇద్దరు నిందితుల కాల్చివేత

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని తర్న్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో పోలీసులకు, నిహంగ్ సిక్కులకు మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో నిహంగ్ సిక్కులు తమ వద్ద ఉన్న కత్తులతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పోలీసుల చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో చేసిన అనంతరం ఇద్దరు నిహంగ్ సిక్కులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారనే సమచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో వల్తోహా ఎస్‌హెచ్ఓ నరేంద్ర సింగ్, ఎస్‌హెచ్ఓ బల్వీందర్ సింగ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన పోలీసులు.. ఇద్దరు నిందితులను కాల్చి చంపేశారు.

 2 Nihangs attack police with swords in Punjab, both shot dead

కాగా, గత ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాటియాలలో ఓ మార్కెట్లోకి ప్రవేశించిన ఓ నిహంగ్ సిక్కును అడ్డుకుకోగా.. అతడు ఏఎస్ఐ చేతిని కత్తితో నరికేశాడు. అయితే, వెంటనే చికిత్స అందించిన వైద్యులు చేతిని అంటించారు. ఏడున్నర గంటలపాటు అతనికి చికిత్స చేశారు వైద్యులు.

English summary
Aclash broke out between police and Nihang Sikhs on Sunday in Punjab's Tarn Taran. The Nihang Sikhs attacked the policemen with swords and reportedly chopped off the hands of two officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X