తాగి అమ్మాయిలతో చిందేసిన ఉద్యోగులు.. వేదిక పైనే ముద్దులతో!

Subscribe to Oneindia Telugu

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పీకల దాకా మద్యం సేవించిన ఉద్యోగులు.. ఆపై అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై అమ్మాయిలతో కలిసి చిందేశారు.

ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. మరో అడుగు ముందుకేసి వేదిక పైనే అమ్మాయిలకు ముద్దులు పెట్టేశారు.
మరుసటి రోజు సోషల్ మీడియాలో ఈ వీడియో దర్శనమివ్వడంతో.. ఉన్నతాధికారుల కంట పడింది. విషయాన్ని సీరియస్ గా పరిగణించిన కలెక్టర్ వీరిద్దరిని సస్పెండ్ చేశాడు.

2 UP govt employees suspended after video with dancers goes viral

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులైన కౌశిక్, ముఖేష్ కుమార్ లు ఇద్దరు గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని ఫుల్లుగా తాగారు. ఆపై వేదికనెక్కి అమ్మాయిలతో చిందేస్తూ.. ముద్దుల దాకా వెళ్లారు.

నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఈ నిర్వాకంపై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. హాత్రాస్ జిల్లా కలెక్టర్ అవినాష్ కృష్ణ సింగ్ కౌశిక్, ముఖేష్ కుమార్ లను సస్పెండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two UP government employees (Lekhpals) in Hathras were suspended on Wednesday after their video of dancing with stage dancers in an inebriated state went viral on social media.
Please Wait while comments are loading...