గన్‌తో బెదిరించి ఇద్దరు మహిళా డ్యాన్సర్లపై గ్యాంగ్ రేప్

న్యూఢిల్లీ: మ్యూజిక్, డ్యాన్స్ ట్రూప్‌కు చెందిన ఇద్దరు మహిళలను షో అనంతరం 12 మంది దుండగులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత తుపాకులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి నిందితుల్లో రాజ్, జితేందర్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లే ఈ డ్యాన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. షో అనంతరం ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి వారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

దేశంలో పర్యాటకులు ఎక్కువ సందర్శించే ఆగ్రాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో జూన్ 25న ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన యవకులు కొంతమంది ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మథుర నుంచి ఓ ఆర్కెస్ట్రా బృందం వచ్చింది.

2 Women Allegedly Kidnapped, Gang-Raped At Gunpoint In Agra

ఈ డ్యాన్స్ ట్రూప్ బృందంలో మొత్తం ముగ్గురు మహిళా డ్యాన్సర్లు ఉన్నారు. అయితే బృందంలోని ఇద్దరు మహిళలిద్దరితో పాటు మరో మహిళ కూడా ఉంది. అయితే ఆమె గర్భవతి కావడంతో వదిలేశారు. షో మధ్యలో గొడవ అయ్యిందని, దాంతో అందరినీ వెళ్లిపొమ్మన్నారని ఆ మూడో మహిళ తెలిపింది.

దీంతో నిర్వహకులు తమను మథుర వరకు దిగబెడుతున్నారని అనుకున్నామని అన్నారు. అయితే మధ్యలో కొంతమంది సాయుధులు మోటారు సైకిళ్లపై తమను ఫాలో అయ్యారని, గ్రామానికి ఒక కిలోమీటరు తర్వాత వాళ్లు కారు ఆపి, సుమారు 10 నుంచి 12 మంది సాయుధులు తమపై దాడి చేశారని ఆమె చెప్పింది.

సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి రెండు గంటల పాటు ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారని, అరిస్తే చంపేస్తామంటూ తుపాకులతో బెదిరించారని బాధితుల్లో ఒక మహిళ పేర్కొన్నారు. ఆ తర్వాత బాధిత మహిళలు ఇద్దరూ ఆగ్రా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+