Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లితో గొడవ: మేనల్లుడిని కప్‌బోర్డులో పెట్టి చంపేసింది

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాస్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ.. తన మేనల్డుడిని దారుణంగా హత్య చేసి, కప్‌బోర్డులో ఉంచింది. బాలుడి తల్లితో గొడవ పడిన తర్వాత ఈ హత్యకు తెగబడింది నిందితురాలు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి శంపా బీబీకి, ఆమె దగ్గరి బంధువైన తజ్మీరా బీబీ అనే మహిళతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంపా బీబీ రెండేళ్ల కుమారుడు కనిపించకుండా పోయాడు.

ఈ నేపథ్యంలో శంపా బీబీ, ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తజ్మీరా బీబీ ఇంట్లో సోదాలు చేయగా ఓ కప్‌బోర్డులో బాలుడి మృతదేహం లభించింది.

2-year-old killed by aunt in west Bengal; body kept in cupboard for 6 hours

కాగా, ఇంట్లోకి వచ్చిన మేనల్లుడిని తజ్మీరా గట్టిగా చెంప మీద కొట్టడంతో అతడు కిందపడి అపస్మారక స్థితిలోకి పోయాడు. తన కుమారుడితో గొడవ పెట్టుకున్నాడనే కోపంతోనే అతడ్ని కొట్టింది. ఆ తర్వాత అతడ్ని ఇంట్లోని కప్‌బోర్డులో పెట్టింది.

Recommended Video

    Dil Raju Adopts 3 Orphans || తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలని చేరదీసిన Dil Raju | Oneindia

    అల్మారాలో పెట్టి అప్పటికే ఆరు గంటలు కావడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలైన తజ్మీరాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాలుడి హత్య ఘటన నేపథ్యంలో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెకలొన్నాయి. దీంతో భారీ పోలీసులు మోహరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+