వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో రోజుకు 20 మంది పిల్లలు అదృశ్యం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఒక కోటి జనాభా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి గంటకు సరాసరి ఒక పిల్లాడు, లేదా అమ్మాయి అదృశ్యం అవుతున్నారు. ఇదేదో కాకి లెక్కలు కాదు, అక్షరాల హొం శాఖ అధికారులు వెళ్లడించిన నివేదిక. హొం శాఖ అధికారుల నివేదిక ప్రకారం ప్రతి రోజు సరాసరి 29 నుండి 24 మంది పిల్లలు ఢిల్లీలో కిడ్నాప్ అవుతున్నారు.వారిలో 50 శాతం మందినే అధికారులు పట్టకొగలుగుతున్నారు.

హొం శాఖ అధికారులు ఈ నివేదిక వెళ్లడించిన తరువాత పిల్లల కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. కొందరు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారని, మరి కొందరిని కిడ్నాప్ చేసి ఇతర నగరాలకు, విదేశాలకు తరలిస్తున్నారని వెలుగు చూసింది.

2015 జనవరి 1వ తేది నుండి మార్చి 10వ తేది వరకు ఢిల్లీలో 1,120 మంది పిల్లలు అదృశ్యం అయ్యారు. వారిలో 50 శాతం మందిని పోలీసులు పట్టుకున్నారు. 2014 ఢిల్లీలో 7,572 మంది పిల్లలు అదృశ్యం అయ్యారు. వారిలో 4,166 మందిని పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

20 Children Go Missing in Delhi Every 24 Hours

2013లో 5, 809 మంది, 2012లో 3,686 మంది పిల్లలు అదృశ్యం అయ్యారు. అనేక కేసులను పోలీసులు చేదించారు. మిగిలిన కేసులు ఇప్పటి వరకు ట్రేస్ కాలేదు. ఢిల్లీలో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు చాల ఉన్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసి నగదు డిమాండ్ చేసే చిల్లర గ్యాంగ్ లు కొన్ని ఉన్నాయి.

పిల్లలను కిడ్నాప్ చేసి గుట్టు చప్పుడు కాకుండ బాలలను విదేశాలకు, అమ్మాయిలను వేశ్యవాటిక కేంద్రాలకు తరలిస్తున్న గ్యాంగ్ లు ఉన్నాయి. ఈ ముఠాలను పట్టుకొవడానికి పోలీసులు శక్తి వంచన లేకుండ కృషి చేస్తున్నారు. అయితే పోలీసు సిబ్బంది కొరత వలన అనేక కేసులు మూలన పడుతున్నాయి.

కుటుంబ సభ్యులు నిర్లక్షంగా వ్యవహరించడం, పాఠశాలలో ఒత్తిడి ఎక్కువ కావడం, చెడు అలవాట్లకు బానిసలు అయిన పిల్లలు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో అలాంటి కేసులు నమోదు అవుతున్నాయని ఒక పోలీసు అధికారి అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ఎక్కువ దృష్టి సారించకుంటే చాల ఇబ్బందులు ఎదురౌతాయని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
It is shocking! 20 children go missing from the national capital every day.Armed with an active and anti-kidnapping unit, the Delhi Police makes dedicated yet ineffective probe to find these missing children
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X