వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 మందికి బ్లాక్ ఫంగస్.. సొంత మందులు వద్దు: పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్

|
Google Oneindia TeluguNews

బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 20 కేసులు వెలుగుచూశాయి. దీంతో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో సొంతంగా మందులు తీసుకోవద్దని.. వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. కరోనా సెకండ్ వేవ్.. తర్వాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.

పుదుచ్చేరిలో బ్లాక్ ఫంగస్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ సిబ్బందితో సహా 20 మంది బాధపడుతున్నారని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. పుదుచ్చేరిలో బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపిస్తోందని ఆమె వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సొంతంగా మందులు తీసుకోకూడదని, చికిత్స కోసం ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు.

20 people affected black fungus in puducherry

Recommended Video

CoviSelf | Mylab Self-Testing Covid Kit | Covid-19 Test At Home | Oneindia Telugu

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అని కొత్త కొత్త వైరస్‌లు వణికిస్తున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న.. వైరస్ ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

English summary
20 people affected black fungus in puducherry lt governor tamilisai soundararajan said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X