జైపూర్‌లో 20 ఏళ్ల జపాన్ టూరిస్ట్‌పై అత్యాచారం

జైపూర్: జైపూర్‌లోని మొజంబాద్ గ్రామానికి సమీపంలో ఉన్న డుడులో జపాన్ టూరిస్ట్‌పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆమెకు గైడ్‌గా వ్యవహరించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జైపూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎస్డీ జైన జపాన్ టూరిస్ట్‌పై జరిగిన అత్యాచార ఘటనను సోమవారం నిర్ధారించారు.

20-year-old Japanese woman tourist raped in Jaipur

పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం జైపూర్‌లోని జల్ మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు జపాన్ మహిళా టూరిస్ట్ వద్దకి ఓ వ్యక్తి రావడం జరిగింది. అతను ఇంగ్లీషు చాలా బాగా మాట్లడాతుండటం... మంచిగా ఇక్కడి ప్రాంతాలను గురించి వివరిస్తున్నట్లు నటించాడు.

ఆనంతరం అతడు జపాన్ టూరిస్ట్‌ను జైపూర్-అజ్మీర్ హైవేపైకి తీసుకెళ్లి డుడు ప్రాంతంలో రేప్ చేశారని తెలిపారు. ఇలా అతడిని నమ్మి జపాన్ టూరిస్ట్ మోసపోయిందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వయసు 23నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటుందని బాధితురాలు పేర్కొంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం నిందితుడి స్కెచ్‌ను వేయించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో టూరిస్ట్‌లపై కొంత మంది ఆకతాయిలు అత్యాచారం చేయడం మామూలైంది. గతంలో 2006లో కూడా ఓ బ్రిటిష్ దేశీయురాలిపై ఉదయ్‌పుర్‌లో అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+