పెళ్లని చెప్పి అమ్మేశాడు: తండ్రిపై కూతురు ఫిర్యాదు

న్యాయవాది గౌరవ్ శ్రీవత్సవ రెండు పేజీలతోకూడిన బాధితురాలి ఫిర్యాదును డిఐజికి అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఘటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖుడేల్ ప్రాంతంలోని జామ్నియా గ్రామానికి చెందిన బాధితురాలు నిరక్షరాస్యురాలు.
వివాహమని చెప్పి తన తండ్రి మాటలు నమ్మి మూడు సార్లు మోసపోయింది. ప్రస్తుతం ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ విధంగా వివాహమని చెప్పి తనను మరోసారి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడనీ, అంతేగాక తనను శారీరకంగా హింసిస్తున్నాడని బాధిరాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
తన తండ్రి మున్నాలాల్ తనను తొలిసారి రూ. 50వేలకు, రెండోసారి 20వేలకు, మూడో సారి 10వేలకు అమ్మేశాడని బాధితురాలు తెలిపింది. కాగా తమకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందని, అయితే డిఐజి కార్యాలయం నుంచి తమకు ఆ ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఖుదేల్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications