దారుణం... లక్నో-ముంబై రైల్లో 20 ఏళ్ల యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్...
లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల ఓ యువతిపై 8 మంది గ్యాప్ రేప్‌కు పాల్పడ్డారు. గత శుక్రవారం(అక్టోబర్ 9) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఇగత్‌పురి-కసారా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... ఇటీవలే వివాహమైన 20 ఏళ్ల ఓ యువతి గత శుక్రవారం తన భర్తతో కలిసి లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది.పెళ్లి తర్వాత ముంబైలో కాపురం పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరు కలిసి రైల్లో ముంబైకి బయలుదేరారు. శుక్రవారం రాత్రి రైలు ఇగత్‌పురి-కసారా మధ్య ప్రయాణిస్తున్న సమయంలో... 8 మంది గ్యాంగ్ ఆ కొత్తజంట వద్దకు వచ్చి బెదిరించారు. భర్తపై దాడికి పాల్పడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.నిందితుల పేర్లను పాక్య దాము పార్థి(20),అర్షద్ షేక్(19),అర్జున్ అలియాస్ సుభాష్ సింగ్ పర్దేశి(20),కిశోర్ నందు సోనవానే అలియాస్ కలివా(25),కాశీనాథ్ రామ్ చంద్ర కశ్య(23),ఆకాశ్ శెనోర్ అలియాస్ అక్యా(20),ధనంజయ్ భగత్ అలియాస్ గుడ్డు(19),రాహుల్ అదోల్ అలియాస్ రాహుల్యగా గుర్తించారు.వీరిలో నలుగురిపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.
ఈ ఎనిమిది మంది రైల్లోకి ఎక్కగానే మొదట కొంతమంది ప్రయాణికులను కత్తులతో బెదిరించి డబ్బులు లాక్కున్నారు.నిజానికి రైల్లోకి ఎక్కిన సమయంలో వారికి ఆ ఆలోచన లేదని పోలీసులు తెలిపారు. ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి మొదట ఓ ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని... దాంతో మిగతావాళ్లు కూడా ఇతర ప్రయాణికులను బెదిరించి డబ్బులు లాక్కున్నారని చెప్పారు. ఇదే క్రమంలో రైల్లో ఉన్న ఓ కొత్తజంటను బెదిరించారన్నారు. ఆమె భర్తపై దాడికి పాల్పడి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు చెప్పారు.అత్యాచార సమయంలో ఆ ఎనిమిది మంది మరిజునా అనే డ్రగ్ మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
రైల్లో మొత్తం 16 మంది ప్రయాణికులను ఈ గ్యాంగ్ దోపిడీ చేసినట్లు రైల్వే పోలీస్ అధికారి మనోజ్ పాటిల్ తెలిపారు. 9 మంది ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్స్ లాక్కున్నారని చెప్పారు.నిందితులపై ఐపీసీ సెక్షన్లు 395,376డీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.మిగతా నలుగురు నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని... నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications