2025లో భారత్ సత్తా చాటిన ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ కు షాక్!
2025 లో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా ఆపరేషన్ సిందూర్ భారతదేశపు శక్తిని చాటింది. పెహల్గాం లో పర్యాటకుల పైన జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అమాయక పర్యాటకులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం భారతదేశంపై ఉగ్ర దాడికి పాల్పడిన వారిని మట్టు పెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది.
ఆపరేషన్ సిందూర్.. ఉగ్ర మూకను మట్టుపెట్టేలా దాడులు
పెహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా స్పందించిన భారత ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ సిందూర్ కు మహిళలే నాయకత్వం వహించారు. భారత సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాలు అటవీ ప్రాంతాలలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో ఉగ్రవాదుల శిబిరాలను, లాజిస్టిక్ సపోర్ట్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు.

భారత్ దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్
పాకిస్తాన్లో సరిహద్దుల ఆవల నుండి జరుగుతున్న చొరబాట్లను అడ్డుకోవడంలో భారత్ గణనీయమైన విజయాన్ని సాధించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోయింది. పాకిస్తాన్ భారత్ పైన ఎదురుదాడికి ప్రయత్నం చేసినప్పటికీ, భారత సైన్యం ఎక్కడికక్కడ పాకిస్తాన్ ఎత్తుగడలను నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ లకు తీవ్రమైన దెబ్బ తగిలింది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు షాక్
ఆపరేషన్ సిందూర్ ప్రత్యక్ష యుద్ధంగా కాకుండా, ఉగ్రవాద మౌలిక వసతులు వాటికి మద్దతు ఇస్తున్న వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సాగడం వల్ల పాకిస్తాన్ కు తీరని నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్ ఉగ్రవాదులకు మాత్రమే కాక వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న శక్తులకు కూడా గట్టి హెచ్చరిక నిచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ కు భారత్ ఈ చర్యతో వెన్నులో వణుకు పుట్టించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొన్న పాకిస్తాన్
ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న ఆరోపణలపైన భారత్ బలమైన ఆధారాలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దీంతో పాకిస్తాన్ దౌత్య పరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. పాకిస్తాన్ దేశంలో అంతర్గత రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
ఉగ్రవాదం పైన భారతదేశం జీరో టాలరెన్స్ విధానానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక
ఆపరేషన్ సిందూర్ ద్వారా పెహల్గామ్ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రతీకారం తీర్చుకున్నామన్న సందేశం ఇవ్వడంతో పాటు, భారత్ జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్ లోయలో భద్రత మరింత కట్టుదిట్టం కావడంతో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయి. ఉగ్రవాదం పైన భారతదేశం జీరో టాలరెన్స్ విధానానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీకగా నిలిచింది. దేశ భద్రత విషయంలో భారత్ ఎటువంటి రాజీ పడదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని ఈ చర్య ద్వారా ప్రపంచానికి భారత్ తెలియజేసింది.












Click it and Unblock the Notifications