కేజ్రీవాల్: మొదటి రోజు కలెక్షన్ రూ. 4 లక్షలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని నివారించడానికి చేపట్టిన సరి-భేసి కార్ల ప్రయోగంలో మొదటి రోజు 203 మంది నియమాలు ఉల్లంఘించి అడ్డంగా బుక్కయ్యారు. నియమాలు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 4.06 లక్షల జరిమానా వసూలు చేశామని అధికారులు తెలిపారు.
జనవరి 1 నుంచి 15వ తేది వరకు ఢిల్లీ నగరంలో సరి-భేసి కార్ల ప్రయోగం చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు జంక్షన్లు, సర్కిల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు వాహనాలు నిలిపి పరిశీలించారు.
అందులో నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వాహనాలు తీసుకు వచ్చిన వారిని గుర్తించారు. నియమాలు ఉల్లంఘించిన 138 మందిని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. మరో 65 మందిని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు.

ఆటో డ్రైవర్లు ఇదే మంచి చాన్స్ అంటూ మీటర్లు వెయ్యకుండా ప్రయాణికుల దగ్గర అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు, రవాణా శాఖ అధికారులు 76 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి జరిమానా వసూలు చేశారు.
సరి సంఖ్య ఉన్న వాహనాలు ఇంటి దగ్గరే వదిలిపెట్టాల్సి రావడంతో ఆటో లో ప్రయాణించడానికి చాల మంది సిద్దం అయ్యారు. అయితే ఆటో డ్రైవర్లు ప్రయాణికులు పిలిచిన చోటకు రాకుండా అధిక మొత్తంలో చార్జీలు డిమాండ్ చెయ్యడంతో ట్రాఫిక్ పోలీసులు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications