భార్యను తాంత్రికుడి వద్దకు పంపిణ భర్త...! అందుకోసం ట్రిపుల్ తలాక్...!!
ముస్లిం చట్టాలను అడ్డుపెట్టుకుని కొంతమంది మృగాళ్లు ఆ మతానికి చెందిన మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేక చట్టాల పేరుతో ముస్లిం మహిళలకు తలాక్ చెబుతూ.. అసాంఘీకంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యంగబద్దమైన చట్టాలను సైతం పక్కనబెట్టి తమ స్వంత చట్టాలపై ఆధారపడుతున్నారు. ఈనేపథ్యంలోనే చట్టాలను యధేచ్చగా ఉల్లంఘిస్తూ... మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఇలాంటీ సంఘటన భోపాల్‌లో జరిగింది.

స్నేహితుడి భార్యపై కన్నేసిన తాంత్రికుడు
మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన ఓ ముస్లిం యువతికి అజీజ్ ఖాన్ అనే యువకుడితో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన యువతి భర్తతో అన్వర్ ఖాన్ అనే పెళ్లిళ్లు చేసే తాంత్రికుడితో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఆమె ఇంటికి తరచూ వెళ్లేవాడు అన్వర్ ఖాన్ . దీంతో ఆమెపై అనుచితంగా ప్రవర్తించేవాడు. తాంత్రికుడి వేధింపులను భరించలేని యువతి తన భర్తకు తెలిపింది. కాని భర్త అజీజ్ ఖాన్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. అవేశానికి గురైన భర్త అజీజ్ ఖాన్ సదరు మహిళకు విడాకులు ఇస్తూ... తలాక్ చెప్పాడు.

నిఖా హలాలా పేరుతో అత్యాచారం
ఈ నేపథ్యంలోనే అదును కోసం వేచి ఉన్న తాంత్రికుడు అన్వర్ ఖాన్ ఆమెపై అత్యాచారం చేశాడు. తనముందే తలాకు చెప్పించి, అనంతరం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి ఓ దర్మార్గమైన కారణం కూడ వివరించాడు. ముస్లిం చట్టం ''నిఖా హాలాలా'' ప్రకారం మహిళలు తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి అదే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే.. విడాకుల అనంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుని, అతనితో కూడ విడాకులు ఇచ్చి, కొంతకాలం విడిగా ఉన్న తర్వాత... తిరిగి మొదటి భర్తను చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ కారణం చెప్పి తాంత్రికుడి ఆమెపై అత్యాచారం చేసినట్టు యువతి ఆరోపణలు చేసింది.

తాంత్రికుడి వద్దకు వెళ్లమని చెప్పిన మహిళ భర్త
ఈ నేపథ్యంలోనే సంఘటన తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయిన యువతి కొద్ది రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు తనపై అత్యాచారం చేశాడని పేర్కోంది. ఇందుకోసం తన భర్త సైతం తాంత్రికుడి వద్దకు వెళ్లమని బలవంతం చేశాడని పోలీసుల ఫిర్యాదులో తెలిపింది. ఇక ఈ ఘటన నవంబర్ 23న జరిగిందని.. ..విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని తన భర్తతోపాటు తాంత్రికుడు సైతం బెదిరించారని చెప్పింది. ఇందుకోసమే వెంటనే ఫిర్యాదు చేయలేదని తెలిపింది. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications