యువతిపై అత్యాచారం.. హత్య.. సున్నితమైన ప్రదేశాల్లోఅతి దారుణంగా.. లవర్ జంప్!
చెన్నై: ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఉద్యోగం చెయ్యడానికి చెన్నై చేరుకుని స్నేహితురాలితో కలిసి నివాసం ఉంటున్న యువతి దారుణ హత్యకు గురి కావడంతో ఆమె స్నేహితులు హడలిపోయారు. అయితే హత్యకు గురైన యువతి ప్రేమలో ఉందని, అతను కూడూ ఉద్యోగం కోసం కాంచీపురం వచ్చాడని, ప్రస్తుతం అతను మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు. యువతి వక్షోజాలు, శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్లో గోళ్లతో గీచిన గీతలు ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒడిశా అమ్మాయి
ఒడిశాకు చెందిన కర్న ప్రియదర్శిణి (22) అనే యువతి చెన్నై సమీపంలోని కాంచీపురం చేరుకుని స్నేహితురాలు రంజిత కుమారి సాహు (22)తో కలిసి పడప్పై సమీపంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది. కర్న ప్రియదర్శిణి, రంజిత కుమారి సాహు కాంచీపురం సమీపంలోని ఒరగడంలోని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

ఉద్యోగానికి స్నేహితురాలు
ఉదయం ఎప్పటిలాగే ఉదయం రంజిత కుమారి సాహు ఉద్యోగానికి వెళ్లింది. ఇంటిలో కర్న ప్రియదర్శిణి మాత్రమే ఉంది. సాయంత్రం ఉద్యోగం ముగించుకుని రంజిత కుమారి సాహు ఇంటికి వచ్చింది. ఇంటిలో కర్న ప్రియదర్శిణి నిద్రపోతున్న స్థితిలో దుప్పటి కప్పుకుని కనిపించింది.

వక్షోజాలు, శరీరం మొత్తం గాయాలు
ఇంటికి వెళ్లిన రంజిత కుమారి సాహు స్నేహితురాలు కర్న ప్రియదర్శిణిని లేపడానికి ప్రయత్నించింది. అయితే ఎంత సేపటికి కర్న ప్రియదర్శిణి స్పందించకపోవడంతో దుప్పటి తీసి చూసింది. కర్న ప్రియదర్శిణి వక్షోజాలు, కడుపు, యద, చాతితో పాటు శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్లో గాయాలు కావడం, ఆమె శరీరం మీద గోళ్లతో గీకారని గుర్తించి కేకలు వేసింది.

అత్యాచారం, హత్య
ఇరుగు పొరుగు వారి సహాయంతో రంజిత కుమారి సాహు తన స్నేహితురాలు కర్న ప్రియదర్శిణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే కర్న ప్రియదర్శిణి మరణించిందని వైద్యులు చెప్పారు. కర్న ప్రియదర్శిణి మీద దాడి చేసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని, మెడ మీద బలమైన చేతితో గీచిన గీతలు ఉన్నాయని వైద్యుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
Recommended Video

ప్రియుడు మాయం
పెర్షాంపూర్ ప్రాంతంలోనీ మీరామ్ కు చెందిన మనీష్ తో కర్న ప్రియదర్శిణి ప్రేమలో ఉందని మణిమంగళం పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మనీష్ ప్రస్తతం షోలింగంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అయితే కర్న ప్రియదర్శిణి హత్యకు గురైన తరువాత మనీష్ మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు. మనీష్ తన ప్రియురాలు కర్న ప్రియదర్శిణి మీద అత్యాచారం చేసి హత్య చేశాడా ? లేక తెలిసిన వాళ్లు ఆమెను పక్కాప్లాన్ తో హత్య చేశారా ? దుండుగులు ఏమైనా హత్య చేశారా ? అనే కోణంలో మణిమంగళం పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications