యువతిని బంధువు, మరో ఇద్దరు ఎత్తుకెళ్లి రేప్ చేశారు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని ఓ బంధువే, మరో ఇద్దరితో కలిసి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన జరిగింది. ఈ దారుణ సంఘటన రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలు రాంపూర్ జిల్లాలోని పట్వారీ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఘనశ్యాంపూర్ యువతి.

తనను తన బంధువే మోసం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బంధువు తన సమ్మతి లేకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లుగా ఓ ఫేక్ పెళ్లి సర్టిఫికేట్ సృష్టించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

22 year old woman abducted and gang raped in Rampur

బాధితురాలు తన ఫిర్యాదులో... నిందితుడు మరో ఇద్దరితో కలిసి తనను బుధవారం ఇంటి వద్ద నుండి అపహరించాడని, అనంతరం తనను ఉత్తరాఖండ్‌లోని రుద్రపురం టౌన్‌కు తీసుకు వెళ్లారని, అక్కడ ముగ్గురు కలిసి తన పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది.

అక్కడి నుండి బాధితురాలు వారి నుండి తప్పించుకొని వచ్చింది. అనంతరం పట్వారీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్పీ పట్వారీ పోలీసులను ఆదేశించారు. నిందితుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+