తుపాకితో బెదిరించి ఇంట్లోనే యువతిపై గ్యాంగ్ రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మీరట్ జిల్లాలోని రోహ్తా ప్రాంతంలోని నివాసంలో 22 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మహిళ భర్త పనికి వెళ్లిన సమయంలో సోమవారంనాడు ఆ సంఘటన జరిగింది. ముగ్గురు నిందితులు సౌకీన్, యూసుఫ్, నఫీస్ అదే గ్రామానికి చెందినవారు. ఇంట్లోకి చొరబడి మహిళపై వారు అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్‌హెచ్ఓ సురేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు.

తుపాకితో బెదిరించి మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయాన్ని ఇతరులకు చెప్తే చంపేస్తామని కూడా నిందితులు బాధితురాలిని బెదిరించారు.
మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications