తల్లి ప్రియుడిని హత్య చేసిన యువకుడికి పదేళ్ల జైలు

2009లో అనిల్ కుమార్ అనే వ్యక్తిని చంపిన నవీన్‌ను అదనపు సెషన్స్ న్యాయమూర్తి రాజేష్ కుమార్ గోయల్ దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించారు. శవాన్ని తరలించడానికి సాయం చేసిన నవీన్ తల్లి సునీతను కూడా కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తన తల్లి కుమార్‌తో శృంగారం చేస్తుండగా చూసిన నవీన్ ఆగ్రహానికి గురై హత్య చేశాడని, ప్రణాళిక ప్రకారం హత్య చేయలేదని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో కోర్టు అంగీకరించింది. చంపిన తర్వాత కుమార్ శవాన్ని తల్లీకొడుకులు బద్లీ కాలువలో పడేశారని, అతని కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదని కోర్టు అభిప్రాయపడింది.
మృతుడి శవం కాలువ పక్కన గోనె సంచీలో పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సునీతతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని మృతుడి భార్య పోలీసులకు చెప్పింది. దాంతో తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications