డ్రామా: జగన్‌పార్టీ, చిన్నరాష్ట్రమని బాబు ఫీలౌతున్నారు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. రైతుల రుణమాఫీ పైన చంద్రబాబు స్పష్టంగా చెప్పడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. రీషెడ్యూల్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
రుణమాఫీ విషయంలో రైతులు చంద్రబాబు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని.. ఆయన సూటిగా సమాధానం చెప్పాలన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తే రైతులపై మరింత భారం పడుతుందన్నారు. రీషెడ్యూల్ వల్ల 14 శాతం వడ్డీ పడుతుందన్నారు. రీషెడ్యూల్ పేరుతో రుణమాఫీ నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు దాటవేత ధోరణి అవలంభించకుండా సూటిగా సమాధానం చెప్పాలన్నారు.
రైతాంగం మీ మాటలు నమ్మేంత అమాయకులు కాదన్నారు. ప్రజలను మోసం చేయవద్దని హితవు పలికారు. ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చి కుదువ పెట్టిన రైతుల డాక్యుమెంట్లను తిరిగి ఇప్పిస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రైతుల వ్యవసాయ రుణాలు అన్నింటిని మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రీషెడ్యూల్ అనడం ఏమిటన్నారు.

చంద్రబాబుపై రఘువీరా సెటైర్
గతంలో 23 జిల్లాల సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను పాలించిన చంద్రబాబు ఇప్పుడు 13 జిల్లాలను పాలించడమేమిటనే భావనలో ఉన్నట్లుగా ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా అన్నారు. ఆ భావన ఉంటే కనుక చంద్రబాబు దాని నుండి బయటపడాలని హితవు పలికారు.
ఆ కాంప్లెక్స్ నుండి చంద్రబాబు త్వరగా బయటపడకుంటే ఏపీకి నష్టమన్నారు. అలా కాకుంటే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలన్నారు. రైతులకు ప్రస్తుతం రీషెడ్యూల్ పరిష్కారంకాదన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రైతులందరికీ తిరిగి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద డబ్బులెక్కడివి అన్నారు.
రీషెడ్యూల్ అంటే రైతుల పైన అదనంగా ఆరువేల కోట్ల భారం పడుతుందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా రైతు రుణమాఫీపై బాబు సర్కారు గందరగోళ పరుస్తోందన్నారు. రీషెడ్యూల్‌తో ప్రయోజనం చేసినట్లుగా భావన కల్పిస్తున్నారన్నారు. 2004లో గంటలోపు తాము రీషెడ్యూల్ చేశామన్నారు. చంద్రబాబు 30 రోజుల పాలన సమస్యల పైన దాటవేత, నాన్చివేత తప్ప మరొకటి లేదన్నారు.












Click it and Unblock the Notifications