వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 గంటల పని, రూ.7 వేల జీతం, పార్లే జీ కబంధహస్తాల నుంచి 26 మంది బాలలకు విముక్తి ...

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్ : పార్లే జీ .. జీ అంటే జీనియస్ యాడ్లు ఇస్తుంటారు. చిన్న పిల్లలకు పోషకాహారం అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. కానీ ఆ యాజమాన్యం ఆ బిస్కట్లను తయారు చేయించిందే చిట్టి చేతులతో .. ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్ పార్లే జీ ప్లాంట్ నుంచి బాల కార్మికులను కార్మికశాఖ కాపాడటం విస్మయానికి గురిచేసింది. అంటే పిల్లలను తినమనే చెప్పే బిస్కెట్లు తయారుచేస్తుంది బాల కార్మికులని స్పష్టమైంది.

 26 child labourers rescued from Parle-G plant

26 మంది బాలలు ..

రాయ్ పూర్ పార్లే జీ ప్లాంట్ నుంచి 26 మంది బాల కార్మికులను కాపాడామని కార్మికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడి ప్లాంటులో బాలలతో పనిచేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో అమసివ్నిలో ఉన్న ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టామని విదాన్ సభ పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి రక్షంచిన బాలలను జువైనల్ హోంకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో ఫ్యాక్టరీ యాజమానిపై ఫిర్యాదు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేశామని .. పేర్కొన్నారు. బాలల వయస్సు 13 ఏళ్ల నుంచి 17 సంవత్సరాలు ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

12 నుంచి సోదాలు
ఈ నెల 12న ప్రపంచ బాల కార్మికుల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని వరసగా దాడులు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించామని పేర్కొన్నారు. అలాగే గత ఆరురోజుల నుంచి 51 మంది బాల కార్మికులను వెట్టి నుంచి కాపాడామని వివరించారు. వీరిలో కొందరిది ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అని పోలీసులు తెలిపారు. వారితో తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు మాట్లాడారని విచారణలో తేలింది. ఈ ప్లాంటులో కార్మికులు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తారని .. అయితే అందుకు వారికి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తారనే కఠోర వాస్తవాన్ని తెలిపారు. నిర్వాహకులపై పిల్లల సంరక్షన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు.

English summary
Twenty-six child labourers were rescued from the plant of popular biscuit brand Parle-G here, police said Saturday. A government task force on child labour had received a tip-off that minors were employed at Parle-G factory in Amasivni area, said Vidhan Sabha Police Station House Officer (SHO) Ashwani Rathore. The task force raided the factory Friday evening and rescued 26 children, he said. They were sent to juvenile shelter home, he added. Based on a complaint filed by the Women and Child Development Department officials, a case was registered against the factory owner under the Juvenile Justice Act, the SHO said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X