బర్త్‌డేకి పిలిచి భూటాన్ యువతిపై గ్యాంగ్‌రేప్ చేశారు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు దారుణ ఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకకు పిలిచి ముగ్గురు వ్యక్తులు.. ఓ 26ఏళ్ల భూటాన్ దేశ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మే 15న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్న బాధిత యువతిని.. బాబు అనే వ్యక్తి తన పుట్టిన రోజు పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె వెళ్లింది.
కాగా, భుక్తియార్, ఖలీద్ అనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాబు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications