మహిళపై గ్యాంగ్‌రేప్: మరో ఘటనలో విద్యార్థినిపై..

 26-Year-Old Woman Allegedly Gangraped in Muzaffarnagar
ముజఫర్‌నగర్/బదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ 26ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో బాధితురాలి భర్త మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని షామ్లీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులైన సలీమ్, అబిద్, భూరలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలిపై 2014, ఫిబ్రవరిలో ఈ ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ దృశ్యాలను వీడియో తీశారు.

అంతటితో ఆగకుండా ఆ వీడియోలతో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో వారి వేధింపులు తాళలేక ఆ మహిళ తన భర్తకు విషయాన్ని తెలిపింది. అతడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సలీం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరో ఘటనలో బదౌన్‌లో 16ఏళ్ల దళిత విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ బాధిత యువతి మృతి చెందిందని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఇంటిపక్కన ఉండే వ్యక్తి, అతని ఇద్దరు స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్‌ను అరెస్ట్ చేసి, మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+