షాక్: యువకుడి కడుపులో నుండి కిలో ఇనుప ముక్కలు, రూ. 790 నాణెలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని ఓ యువకుడి కడుపులో నుండి 263 నాణెలను, సూదులను వైద్యులు తొలగించారు. సుమారు. రూ.790 విలువైన నాణెలు ఆ యువకుడి కడుపు నుండి తొలగించారు వైద్యులు.
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని ఓ యువకుడి కడుపులో నుండి 263 నాణెలను, సూదులను వైద్యులు తొలగించారు. సుమారు. రూ.790 విలువైన నాణెలు ఆ యువకుడి కడుపు నుండి తొలగించారు వైద్యులు.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. చిన్నతనంలో కొందరు బలపాలు తింటుంటారు. మరికొందరు సున్నం తింటారు. అయితే పెద్దయ్యాక కూడ కొందరు ఈ అలవాట్లను మార్చుకోరు.
అయితే ఎవరు చూడకుండా ఈ అలవాట్లను కొనసాగిస్తారు. కొందరైతే బహిరంగంగానే తమ చిన్ననాటి నుండి కొనసాగిస్తున్న అలవాట్లను అదే తరహలో పాటిస్తుంటారు.అయితే ఈ తరహ అలవాట్లు కొన్ని సమయాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చే ఘటనలు కూడ లేకపోలేదు.

యువకుడి కడుపులో నుండి 263 నాణెలు తీసివేత
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి 263 నాణెలను వెలికితీశారు. అయితే ఈ నాణెల విలువ సుమారు. 790 రూపాయాలుగా గుర్తించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని వైద్యులు చెప్పారు.

కిలో బరువున్న ఇనుపముక్కలు, సూదులు
ఈ యువకుడి కడుపు నుండి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. అంతేకాదు సూదులను కూడ తొలగించారు. కడుపులో నాణెలు, ఇనుపముక్కలు, సూదులు నిండిపోయాయి. ఇనుప ముక్కల బరువే సుమారు కిలో వరకు ఉంటుందని వైద్యులు గుర్తించారు.సైకిల్ చైన్ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయని వైద్యులు చెప్పారు.

అస్వస్థతకు గురైన బాధితుడు
కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు బాధితుడు. అయితే పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

3 గంటల పాటు ఆపరేషన్
మూడు గంటలపాటు బాధితుడికి ఆపరేషన్ నిర్వహించి వైద్యులు అతడి కడుపులో ఉన్న వ్యర్థాలను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకొంటున్నాడని వైద్యులు ప్రకటించారు. మరో వైపు ఇదే తరహలో నెల రోజుల క్రితం కోల్‌కత్తాలో 48 ఏళ్ వ్యక్తి కడుపులో నుండి సుమారు కిలో బరువున్న గోళ్ళను వెలికితీశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications