పద్మనాభస్వామి ఆలయంలో 266కిలోల బంగారం మాయం: సుప్రీంకు నివేదిక
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువనంతపురం శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమైంది. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిటింగ్ నివేదికలో మాజీ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ ఈ విషయం తెలిపారు.
ఆలయంలోని 893 కిలోల బంగారాన్ని వివిధ కార్యక్రమాల నిమిత్తం బయటకు తీసుకెళ్లగా, తిరిగి 627 కిలోల బంగారం మాత్రమే దేవస్థానానికి చేరుకుందని వినోద్‌రాయ్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఆలయంలోని బంగారంపై సంబంధిత రికార్డులను తనిఖీచేసి ఆడిటింగ్ నివేదిక సమర్పించాలని వినోద్‌రాయ్‌ను నిరుడు ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

వినోద్ రాయ్ నివేదికతో బంగారం మాయం కావడానికి కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని సిపిఎం ఎమ్మెల్యే వి శివకుట్టి వ్యాఖ్యానించారు. కాగా, దేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రావెల్‌కోర్ రాజ కుటుంబం రాయ్ నివేదికపై స్పందించలేదు.
దేవస్థానం పనితీరును పూర్తిగా ప్రక్షాళన చేయాలని న్యాయస్థానానికి సహాయకుడిగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం సిఫార్సుమేరకు జస్టిస్ ఆర్‌ఎం లోధా, జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరుడు ఏప్రిల్‌లో అడిటింగ్ నిర్వహించాలని వినోద్‌రాయ్‌ను ఆదేశించింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications