వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో దారుణం: మహిళ గ్యాంగ్‌రేప్, వీడియో తీసి బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: నన్‌పై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని లేక్ టౌన్ ప్రాంతంలో మార్చి 9న ఓ 28 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతేగాక, ఆ దృశ్యాలను వీడియో తీశారు. విషయం ఎవరికైనా చెబితే, సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేస్తామని బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు. బాధితురాలు, అతని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు మంగళవారం తెలిపారు.

పోలీసులమని బెదిరించి యువతిపై దుండగుల రేప్

27-year-old woman gangraped in Kolkata

చెన్నై: తమిళనాడులోని శివగంగలో ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడితో ఉన్న యువతిని పోలీసులమని బెదిరించి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మానసిక వికలాంగురాలిపై రేప్: ఇద్దరి అరెస్ట్

థానే: మానసిక వికలాంగురాలైన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నౌపదలోని గణేష్ వాహ్(24), గణేష్ బోర్డే(40) అనే ఇద్దరు వ్యక్తులు సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీంతో ఆమె ప్రస్తుతం 3నెలల గర్భవతి అయింది.

తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలిక తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఆమెకు మాయమాటలు చెప్పిన ఇద్దరు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమెను బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. చివరకు విషయం బయటికి రావడంతో పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

English summary
A 27-year-old woman was allegedly gangraped by her neighbours in Lake town area of the city, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X