ఉద్యోగం ఇప్పిస్తానని లాడ్జికి పిలిపించి రేప్ చేశాడు
థానే: ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళకు ఆశ చూపిన ఓ యువకుడు ఆమెను లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ తనకు ఉద్యోగం కావాలని తన స్నేహితురాలితో చెప్పింది. ఆమె నిందితుడు గోరిగప వాగ్మర్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. దీంతో ఆమె ఉద్యోగం కోసం తరచూ అతనికి ఫోన్ చేసేది. ఈ నేపథ్యంలో వారి పరిచయం బాగా పెరిగింది. తనకు పోలీసు శాఖలో చాలామంది తెలుసని, హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుడు ఆమెకు చెప్పాడు.
బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆ మహిళకు ఫోన్ చేసిన వాగ్మర్.. భయందర్‌లోని జైమాల లాడ్చికి బయోడేటాతో రావాలని కోరాడు. అక్కడ ఎవరినో కలవాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత రాత్రి 10.30 ప్రాంతంలో నిందితుడు వాగ్మర్ లాడ్జి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలి తన స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధిత యువతిని వైద్య పరీక్ష నిమిత్తం థానే సివిల్ ఆస్పత్రికి తరలించారు.
రెండేళ్ల క్రితం కిడ్నాపైన బాలిక హత్య
పాట్నా: ముజఫర్‌నగర్‌లోని తన ఇంటి ఎదుట రెండేళ్ల క్రితం అపహరణకు గురైన నవ్రుణ అనే ఏడవ తరగతి బాలిక హత్యకు గురైందని సిబిఐ తేల్చింది. ఈ మేరకు సమాచారాన్ని బాధితురాలి తల్లిదండ్రులు అతుల్య, మైత్రీయి చక్రవర్తికి తెలియజేసింది.
బాలికను హత్య చేసిన దుండగులు ఆమె ఇంటి సమీపంలోని పాతిపెట్టినట్లు పేర్కొంది. ఆమె హత్యకు కారణమైన నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు సిబిఐ, పోలీసులు తెలిపారు. లాండ్ మాఫీయా కారణంగానే తన కూతురు హత్యకు గురైందని బాలిక తండ్రి ఆరోపించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications