ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్‌డేట్ ఇదే...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7092కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం (డిసెంబర్ 26) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా మరో 442 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,69,920కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 42,911 శాంపిల్స్‌‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,15,74,117కు చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 56 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదైంది. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,23,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

282 new coronavirus cases and three deaths reported in andhra pradesh

త్వరలోనే భారత్‌లో అత్యవసర వినియోగం కోసం కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కోసం సోమవారం(డిసెంబర్ 23) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందజేయడం, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టాస్క్‌ఫోర్స్‌లు పనిచేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+