2జీ కేసు: కోర్టులో రాజా భావోద్వేగం, కళ్లలో నీళ్లు, ఏడ్చిన భార్య, కూతురు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో తీర్పు వెలువడగానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన టెలికం మాజీ మంత్రి ఎ రాజా భార్య, కూతురు కోర్టులోనే కంటతడి పెట్టారు. ఈ కేసులో రాజా నిర్దోషి అని పాటియాలా కోర్టు జడ్డి సింగిల్ లైన్ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆసక్తికరం: లాయర్‌నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!

అనంతరం రాజాను ఆలింగనం చేసుకొని భావోద్వేగంతో చూస్తూ బయటకు వెళ్లిపోయారు. డీఎంకే అధినేత్రి కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళి కూడా భావోద్వేగంతో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

2జీ స్కాంపై మన్మోహన్ ఇలా, అలాగే చేయండి.. స్వీట్లు పంచిన స్టాలిన్

రాజా కళ్లలో నీళ్లు

రాజా కళ్లలో నీళ్లు

కోర్టు తీర్పు అనంతరం ఎ రాజా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. రాజా ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో కోర్టుకు వచ్చారు. అతని వెంట పెద్ద ఎత్తున మద్దతుదారులు రావడంతో కాస్త ఇబ్బంది అయింది. లోపలకు వెళ్లాక జడ్జి తీర్పు చదువుతుండగా రాజా కళ్లలో నీళ్లు తిరిగాయి.

 హైకోర్టులో సవాల్ చేయనున్న సీబీఐ

హైకోర్టులో సవాల్ చేయనున్న సీబీఐ

2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో ఎ రాజా, కనిమొళి నిర్దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు కోర్టు పేర్కొంది. ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేయనుంది.

 ఇంటికి వెళ్లాక స్పందిస్తా

ఇంటికి వెళ్లాక స్పందిస్తా

తీర్పుపై తక్షణమే స్పందించేందుకు రాజా నిరాకరించారు. కోర్టు తీర్పుతో ఆయనలో ఉత్సాహం కనిపించింది. విలేకరులో ప్రశ్నించగా ఇంటికి వెళ్లాక స్పందిస్తానని చెప్పారు. మీడియా తరిచి తరిచి ప్రశ్నించినప్పటికీ తాను చెబుతూనే ఉన్నా కదా, ఇంటికి వెళ్లాక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.

 సుబ్రహ్మణ్య స్వామి

సుబ్రహ్మణ్య స్వామి

2జి కేసు తీర్పుపై బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగవ కోర్టుకు వెళ్తే తీర్పు తారుమారు అవుతుందని చెప్పారు. అప్పట్లో అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, సుప్రీం కోర్టులో భిన్నమైన తీర్పు వచ్చిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former telecom minister was in tears as the court read out the verdict acquitting him of all charges in the 2G scam. The packed court hall into which journalists were not allowed waited with bated breath for the verdict.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి